చౌదరి గారి అబ్బాయి..
ప్రేమ ఎప్పుడు ఎలా మొదలు అవుతుందో ఎవ్వరికీ తెలియదు...
నేను ఆయన నీ ప్రేమిస్తున్నాను, ఆరాధిస్తూ ఉన్నాను... ఇప్పటికీ ఎప్పటికీ ఆయన నా మనసులో నిలిచిపోయారు.. ఆయన తోడు కావాలి, సపోర్ట్ కావాలి, స్నేహితురాలిగా అయినా ఉండాలి అనుకున్నా,. ఆయన విలువైన సమయాన్ని నాకోసం కేటాయిస్తే బాగుండును అనుకుంటాను అప్పుడప్పుడు....
తరిమే వరమా... తడిమే స్వరమా.....
ఇదిగో ఈ జన్మ నీధని అంటున్నా వింటున్నావా!
వింటున్నావా!
వింటున్నావా!
కాలాలు మారవచ్చు , కలలు మారవచ్చు కానీ, మీ పైన నా మనసులో ఉన్న ప్రత్యేకస్థానం ఎప్పటికీ మారదు...
ప్రేమ ఎంత మధురం.... నిజమైన ప్రేమ ఎక్కడ అయితే ఉంటుందో అక్కడ స్వార్థం ఉండదు.... నేను అతని తో జీవితాన్ని పంచుకోవాలని కన్న నా కలలు, కలలు గా మిగిలిపోయాయి. ఆయన ఆలోచన నేను కాకపోయినా, నా ప్రతి జ్ఞాపకం లో వారు ఉన్నారు....
నా పేరు పూర్ణిమ, మాది వైజాగ్. కానీ విజయవాడ లో సెటిల్ అయ్యాము... అక్కడే పెరిగాను, మాది రైతు కుటుంబం, అమ్మ నాన్న కి నేను ఒక్కదాన్నే.... అమ్మ నా చిన్నప్పుడే. మరణించారు. పెద్దమ్మ నన్ను పెంచారు, చిన్నప్పటి నుండి పెద్దమ్మ అలవాటు, తను చాలా స్వీట్.... బాగా గారాబం చేస్తారు, ఇంట్లో అందరికీ నేను ఒక సూర్యకాంతం, బ్రహ్మ రాక్షసిని.... అన్నిట్లో గెలవాలి, నేను అనుకున్నది సాధించేవరకు వదలను.. చాలా పట్టుదల..
నేను ఇంట్మీడియట్ పూర్తి చేశాను, డిగ్రీ జాయిన్ అయ్యాను, అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న నా జీవితం లోకి వచ్చారు... ఆయన "కార్తీక్"...
మా అక్క వాళ్ళ ఇంటి పై ఫ్లాట్ లో ఉంటారు... వాళ్ళ ఫ్యామిలీ,. వాళ్ళకి ఇద్దరు అబ్బాయిలు,. పెద్ద అబ్బాయి అమెరికా లో సెటిల్ అయ్యారు,. చిన్న అబ్బాయి కార్తీక్, ఆయన విజయవాడ లో రౌడీ....
నేను ఒకరోజు మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాను... అక్కడ మొదటి సారి నేను వారిని చూసాను... కింద పార్కింగ్ దగ్గర,. ఆ రోజే మొదట నేను వారిని చూడటం...
ఆయన అంటే ఒక రాయల్టీ, కోలా ముఖం,. కొటీరు లాంటి ముక్కు, గంభీరంగా కనిపించే గడ్డం, చూడగానే ఆకర్షించే నవ్వు, ఆయన రూపం వర్ణనాతీతం.... మూవీ లో ఏ మాత్రం తీసిపోని "శ్రీరామ చంద్రుడు...".
"మగధీరుడు"...
శ్రీ మన్ మహారాజ..... మార్తాండ తేజా..... ప్రియనందభోజా.... మీ శ్రీ చరణా భోజములకు, ప్రేమతో నమస్కరించి, మీము వరించి మీ గురించి ఎన్నో కలలు కన్న కన్నె బంగారు, భయముతో,. భక్తి తో, అను రక్తి తో సాయంగా విన్నపములు.......
సంధ్యా రాగం చంద్ర హారతి పడుతున్న వేళ మసక చీకటి మద్యమా మది పాడుతున్న వేళ ఓ శుభ ముహూర్తాన...
తొలిసారి అతన్ని చూసింది మొదలు కదిలాయి మదిలోన ఎన్నెన్నో కథలు... ఎన్నెన్నో కథలు....
నిద్దుర పోని కనుపాప లకు జోల పాడాలేక , ఏ తల్లి కుమారుడు తెలియదు కానీ, ఎంతటి సుకుమారుడో తెలుసు నాకు.....
ఎంతటి మగదీరులో తెలియ లేదు కానీ, నా మనసును దోచిన చోరులు వీరు...
వారిని ఆ రోజే మొదట చూసాను... ఆ తర్వాత వారిని చూడటానికి అక్క వాళ్ళ ఇంటికి ఏదో ఒక సాకుతో వెళ్లేదానిని... వారు బయటకు వెళ్లేటపపుడు వచ్చే ఘుమ ఘుమలు (స్ప్రే) దూరం నుండి ఆస్వాదించాను.... వారు నాకు దగ్గర లోకి వచ్చారు అనడానికి హింట్ ఇచ్చే ఫ్రెండ్ అది....(వారికి నేను ఎవరో తెలీదు)...
ఒకరోజు నేను వారిని మా అక్క కి చూపించాను, అక్క తనని చూసి, ఆ... ఆ.. అబ్బాయి మన పైన ఫ్లాట్ లో ఉంటారు, మన బావగారికి తెలుసు వాళ్ళు అన్నది.... వాళ్ళ నాన్న గారు బావగారికి తెలిసిన వారు..
నేను: అక్క వారిని చూడటానికి నాకు ఏదో తెలియని ఆరాటం... మళ్లీ మళ్లీ వెయిట్ చేసి మరీ చూడాలని ఉంది,. చాలా గుర్తు వస్తున్నారు, ఎందుకో వారి రూపం నా ముందు కదలాడతూ ఉన్న ఫీలింగ్ కలుగుతుంది, వారిని నేను డైరెక్ట్ గా కూడా చూడలేదు కదా! అని అడిగాను...
అక్క: బాగున్నాడు కదా! ఆ అబ్బాయి మా అందరికీ కూడా బాగా నచ్చాడు....
నేను: నాకు అతను అంటే ఇష్టం... కానీ ఎదురు పడి మాట్లాడాలంటే చాలా భయం.. కానీ వారిని చూడాలని,. మాట్లాడాలని నాకు మనసులో ఉంది, కానీ భయం... నేను చెప్పింది అక్క విని ఊరుకుంది... ఆ అబ్బాయి బయటకు వెళ్లేటప్పుడు,. వచ్చేటపుడు, కింద కనిపించినా ఛాన్స్ మిస్స్ చేసుకునే దానిని కాదు... వారిని చూడాలని ఒక ఎక్సైటింగ్...
వారిని చూసిన మొదటి చూపులోనే ఎన్నో ఊహించుకున్నాను....
అప్పటికే వారు ఒక రౌడీ అని తెలుసు...
తెలిసి కూడా ప్రేమించాను...
ఒకరోజు అక్క ఈ విషయం బావగారికి చెప్పింది...
బావగారు విని దాన్లో ఏముంది,. పూర్ణిమ కి కూడా సంబంధాలు చూస్తున్నాం కదా అదేదో ఆ అబ్బాయి ఏ అనుకుందాం, నేను వాళ్ళ నాన్న గారితో మాట్లాడతాను అన్నారు....
ఒక రోజు పెళ్లి విషయం మాట్లాడడానికి వాళ్ళ నాన్న గారిని కలిశారు... మాకు మీ చిన్న అబ్బాయి బాగా నచ్చాడు, ప్రసాద్ గారు హీరో లాగ ఉంటాడు (మా అమ్మాయి కి సంబంధాలు చూస్తున్నాం) అని మొదలు పెట్టారు.. వాళ్ళు వద్దు అనలేదు, కానీ మా పెద్దబ్బాయి కి ఇంకా అవ్వలేదు అండి ముందు చిన్న అబ్బాయి కి అంటే ఆలోచించాలి అన్నారు.....
కొన్ని రోజులు ఇంట్లో అందరూ ఈ విషయం. గురించి ఆలోచించారు.... వాళ్ళు ఇంతవరకూ ఏ సంగతి చెప్పలేదు, పోని వాళ్ళ పెద్ద అబ్బాయి కి సంబంధం కుదిరాక అయిన మీ అమ్మాయిని కోడలి గా చేసుకుంటాం అని మాట ఇవ్వలేదు కదా! మరి అలాంటపుడు మనం వాళ్ళ కోసం చూడటం అనవసరం... అని అనుకున్నారు.
ఆ తర్వాత ఈ పెళ్లి విషయం రాలేదు....
కొన్నాళ్ళ తర్వాత నాకు ఒక సంబంధం కుదిర్చారు ఇంట్లో... మంచి అబ్బాయి, తిన కూడా ఉంది, ఆడపిల్లలు లేరు, భోలేడు ఆస్తి, మంచి ఫ్యామిలీ అని చెప్పి ఒప్పించారు....
అప్పటికి నాకు ఆ పెళ్లి చేసుకోవాలని అస్సలు లేదు.... కానీ పెద్దమ్మ వాళ్ళు బాధపడతారు అని ఒప్పుకో వలసి వచ్చింది...
నేను ఒకటి తలిస్తే, విధి ఒకటి తలచింది...
నా పెళ్లి వేరొకరి తో అయిపోయింది, నా భర్త మంచివారు, ఆయన ఒక ఉద్యోగి... హైదరాబాద్ లో జాబ్ చేస్తారు, మా అత్తమ్మ, మావయ్య గారు గుంటూరు లో ఉంటారు... మావయ్య గారు సివిల్ ఇంజనీర్....
నా పెళ్లి అయిన కొన్నాళ్ళకి నాకు ఈ విషయం తెలిసింది, నేను ఎంతగానో ప్రేమించిన వ్యక్తి వేరొకరిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అని....(బాధపడ్డాను)...
అంతా బాగానే నాలుగేళ్లు గడిచిపోయాయి.. ఒక బాబు నాకు మూడు సంవత్సరాలు వాడికి... వాళ్ళ నాన్న లాగ ఉంటాడు... ఈ మూడు సంవత్సరాల లో ఇంటికి వెళ్ళిన ప్రతి సారి అతని (కార్తీక్)గురించి అక్క నీ అడగని సందర్భం లేదు...
ఒకసారి విజయవాడ వెళ్ళాను వినాయకచవితి కి, అక్క వాళ్ళ ఇంటికి దగ్గర్లో వినాయకుడి విగ్రహం పెట్టారు... చవితి అయిపోయాక నిమర్జనం కన్నా ముందే ఒకరోజు వినాయకుడి దగ్గరకు వెళ్ళాము...
నేను, అక్క...
గణేష్స్వామి నీ దర్శించుకుని వెనక్కు తిరిగాను...
అక్కడ మళ్లీ వారిని చూసాను (కార్తీక్ నీ)... వాళ్ళ బాబు నీ సరదాగా బయటకు తీసుకువచ్చారు.. వాళ్ళ నాన్నగారు ఉన్నారు పక్కన..
నేను ఒక్కసారిగా కార్తిక్ నీ చూసి షాక్ అయ్యాను, మా అక్క కి చూపించి ఆ అబ్బాయి ఏ నా తను అని అడిగాను, లేకపోతే కల ఏమైనా కంటున్ననా అని..(నా పెళ్లి అయిన నాలుగు సంవత్సరాలలో అతనిని గుర్తు తెచ్చుకొని క్షణం లేదు) అక్క వాళ్ళ నీ చూసి అవును అతను ఆ అబ్బాయి ఏ అన్నది.. నేను షాక్ లోకి వెళ్ళిపోయాను...
ఇన్ని సంవత్సరాల తర్వాత తను మళ్ళీ నాకు ఎందుకు కనిపించారు,. పక్కన వాళ్ళ బాబు నీ చూసి ఏదో తెలియని బాధ, వొళ్ళు షివెరింగ్ వచ్చేసి కాసేపు నేను ఏదో అయిపోయాను, ఎన్నో కలలు కన్నాను కార్తిక్ నీ పెళ్లి చేసుకోవాలి అని, అతను ఇప్పుడు వేరొకరి సొంతం...
అక్క వాళ్ళ తో మాట్లాడింది.. నేను దూరంగా నిలబడ్డాను, ఆ తర్వాత నేను హైదరాబాద్ వచ్చేసాను... వచ్చాక వారం రోజులు నిద్ర లేదు... కూర్చున్న పడుకున్న అతనే గుర్తు వస్తున్నారు... సరిగ్గా తిన లేను, సరిగ్గా పడుకొలేను (ఎవ్వరికీ చెప్పుకో లేను)....
నా భర్త: భోజనం చేస్తూ ఎంటి అంత పరధ్యానం, అమ్మాయి గారికి హైదరాబాద్ రావాలని లేదు అనుకుంటాను.... అన్నారు.
నేను: అదేమీ లేదు అండి, అందర్నీ వదిలేసి వచ్చాను కదా! ఇన్ని రోజుల తర్వాత మళ్లీ ఏదో లాగ ఉంది అని జవాబు చెప్పాను..
బాగా ఆలోచించి,
ఒకరోజు ఆ అబ్బాయి కి ఫేస్ బుక్ లో మెసేజ్ చేద్దాం అనుకుని రిక్వెస్ట్ పెట్టాను... ఆ మర్నాడు నా రిక్వెస్ట్ ఆక్సెప్టు చేశారు?..
(నా జీవితంలో ఒక కొత్త మలుపు ఇది)..
ఇంకా ఉంది.....









